దేశంలో కరోనా అంతానికి వ్యాక్సినేషన్ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం వేగం చేసింది. వివిధ రాష్ట్రాలు తమ ప్రజలకు కోవిడ్ టీకాలను ఇస్తున్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లా వందశాతం కోవిడ్ టీకా వేసిన జిల్లాగా రికార్డ్ స్రుష్టించింది. ఈ జిల్లాలో కోవిడ్ టీకా తీసుకునే అర్హత ఉండి, 18 ఏళ్లకు పైబడిన వారందరికీ టీకాలు అందాయి. అంతకుముందు గత ఆగస్టులోనే కిన్నౌర్ జిల్లాలోని 18 ఏళ్లకు పైబడిన ప్రజలంతా మొదటి డోసు కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్నట్లు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా రెండు డోసులు తీసుకున్నవారి సంఖ్య వందశాతాన్ని చేరింది. అర్హులైన వారికి టీకాలు అందించాలనే మా లక్ష్యం నెరవేరిందని కిన్నౌర్ జిల్లా కలెక్టర్ అబిద్ హుస్సేన్ సాధిక్ అన్నారు. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా ప్రస్తుతం 96.82 కోట్ల డోసుల టీకాను వేసినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. గత సెప్టెంబర్ లో దాద్రా నగర్ హవేలీ, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, గోవా, లడఖ్, లక్షద్వీప్ లోని 18 ఏళ్లకు పైబడిన వారందరికి మొదటి డోసు టీకా అందినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.
దేశంలో వందశాతం కరోనా వ్యాక్సినేటెడ్ జిల్లా ఏదో తెలుసా…?
By Advik
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
వాళ్ల అంతు తేల్చేందుకే తూ.గో జిల్లాలో పోటీ చేస్తున్నా : పవన్ కళ్యాణ్
కాకినాడ అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్, కన్నబాబులపై జనసేన చీఫ్...
Ganesh -
నవరత్నాలు మరింత ప్రకాశవంతంగా మెరిసేలా మేనిఫెస్టో : కారుమూరి వెంకట నాగేశ్వరరావు
ఈ రోజు ఉదయం వైసీపీ తన మేనిఫెస్టోనురిలీజ్ చేసిన విషయం తెలిసిందే....
Ganesh -
అతను మాత్రమే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టగలడు: యువరాజ్ సింగ్
యువరాజ్ సింగ్.. టీమిండియా క్రికెట్ చరిత్రలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం...
Ganesh -