బావాబామ్మర్దుల కామెడీ మామూలుగా లేదు…!

-

రాజకీయాల్లో ఏ నాయకుడైన…ప్రత్యర్ధులకు కౌంటర్లు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వాలి…కౌంటర్లు ఇస్తే ప్రత్యర్ధులకు అదిరిపోవాలి…అలా కాకుండా కౌంటర్లే రివర్స్ అయితే నవ్వుల పాలవుతారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బావ-బామ్మర్దిలైన హరీష్ రావు, కేటీఆర్‌ల పరిస్తితి అలాగే ఉంది. ఈ ఇద్దరు టి‌ఆర్‌ఎస్‌ని చెరో భుజం మీద పెట్టుకుని మోస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరే ప్రత్యర్ధులకు రాజకీయంగా చెక్ పెట్టేందుకు చూస్తున్నారు. కానీ తాజాగా వీరు ప్రత్యర్ధులకు చెక్ పెట్టబోయి, సొంత పార్టీకే బొక్క పెట్టారు.

హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ని ఓడించాలని హరీష్ రావు కాలుకు బలపం కట్టుకుని మరీ తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే హరీష్ బీజేపీని టార్గెట్ చేసి రాజకీయం చేస్తున్నారు. ఈటలని తిట్టిన యూజ్ లేదని అర్ధమైపోతుంది. అందుకే కేంద్రంలో అధికారంలో ఉన్న బి‌జే‌పి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. బి‌జే‌పి…పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తుందని హుజూరాబాద్ ప్రచారంలో చెబుతున్నారు. ఈ ధరల పెరుగుదలలో టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం వాటా ఉందనే విషయం జనాలకు తెలుసు. కానీ అదేదో బి‌జే‌పి తప్పే అన్నట్లు హరీష్ ప్రచారం చేస్తున్నారు.

పైగా గ్యాస్ సిలిండర్… ప్రచార రథానికి కట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. హుజూరాబాద్‌లో పోటీ చేస్తున్న ఒక ఇండిపెండెంట్ అభ్యర్ధి గుర్తు కూడా సిలిండర్. అలాంటప్పుడు హరీష్… కారు గుర్తుకు ఓటేయమంటున్నారా లేక సిలిండర్‌ గుర్తుకు ఓటు వేయమంటున్నారో తెలియడం లేదని జనాలు నవ్వుకునే పరిస్తితి.

అటు కేటీఆర్ కూడా తాజాగా.. తెలంగాణ‌ బీజేపీ నేతలు కట్టగట్టుకొని కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్తారని, వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌లోకి వెళ్తేనైనా కనీసం డిపాజిట్లు అయినా వస్తాయనేది వారి ఆలోచన అంటూ సెటైర్ వేశారు. ఇది కూడా రివర్స్ అవుతుంది… అంటే కాంగ్రెస్‌లోకైనా వెళ్ళేందుకు నాయకులు సిద్ధంగా ఉన్నారు గానీ, టి‌ఆర్‌ఎస్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా లేరనేది కూడా వస్తుంది. ఒకవేళ టి‌ఆర్‌ఎస్‌లో టిక్కెట్ దక్కనివారికి…. కాంగ్రెస్‌లో డిపాజిట్ అయిన దక్కుతుందని కేటీఆర్ హింట్ ఇచ్చినట్లైంది. మొత్తానికి బావాబామ్మర్దులు మంచి కామెడీనే చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news