హుజూరాబాద్ బైపోల్: ‘ట్రెండ్’ క్లారిటీ వస్తుంది..!

-

హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ఊపందుకుంది…పోలింగ్ మొదలైన సమయం దగ్గర నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు తీరారు. హుజూరాబాద్ ప్రజానీకం పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలివస్తుంది. ఇప్పటికే భారీ స్థాయిలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర ఉన్నారు. ఇటు ప్రధాన పార్టీల అభ్యర్ధులు..పోలింగ్ కేంద్రాలు తిరుగుతూ ఓటింగ్ సరళిని గమనిస్తున్నారు.

Huzurabad | హుజురాబాద్
Huzurabad | హుజురాబాద్

అయితే ఏ పార్టీ పరిస్తితి ఎలా ఉన్నా సరే అధికార టీఆర్ఎస్ మాత్రం…ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఆ పార్టీ నేతలు ఇంకా ఓటర్లని ప్రలోభ పెట్టడానికే చూస్తున్నారు. అసలు నాన్ లోకల్ లీడర్లు చాలామంది హుజూరాబాద్‌లోనే మకాం వేసి ఓటర్లని ఇంకా తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అటు పోలింగ్ సమయంలో తిరుగుతున్న టీఆర్ఎస్ నేతలని బీజేపీ నేతలే కాదు…ఏకంగా ప్రజలే అడ్డుకునే పరిస్తితి.

వీణవంక మండలం గన్ముక్ల గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి కాస్త హడావిడి చేశారు. దీంతో ఆయన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. జై ఈటల అంటూ నినాదాలు చేశారు. ఇక చివరికి చేసేది ఏమి లేక కౌశిక్ రెడ్డి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇక ఇల్లందుకుంటలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద టీఆర్ఎస్ నేత మాదాసు శ్రీనివాస్…ఓటర్లని ప్రలోభ పెట్టడానికి చూశారు. ఈ క్రమంలోనే అక్కడి గ్రామ ప్రజలు ఆయన్ని అడ్డుకుని, అక్కడ నుంచి పంపించేశారు. ఇలా అనేక చోట్ల టీఆర్ఎస్ నేతలు తమ శక్తివంచన లేకుండా ఓటర్లని ప్రలోభ పెట్టేందుకు చూస్తున్నారు…అలాగే వారిని గ్రామ ప్రజలే అడ్డుకునే పరిస్తితి.

అంటే హుజూరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందో క్లియర్‌గా అర్ధమైపోతుంది….జనం ఎవరి వైపు ఉన్నారో కూడా క్లారిటీ వచ్చేస్తుంది. టీఆర్ఎస్ నేతలకు జనం ఎక్కడకక్కడ చుక్కలు చూపిస్తున్నారంటే….హుజూరాబాద్‌లో పోలింగ్ ట్రెండ్ ఎవరికి అనుకూలంగా నడుస్తుందో తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news