వ్యాక్సినేషన్ లో యూపీ రికార్డ్… దేశంలోనే ఫస్ట్ ప్లేస్

-

కరోనా అంతానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను వేగవంతం చేసింది. ఇటీవలే 100 కోట్ల డోసుల మైలురాయిని దాటింది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో రికార్డ్ నమోదు చేసింది. దేశంలో అత్యధిక డోసులు టీకాలు వేసిన రాష్ట్రంగా ఘనత సాధించింది. 13 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ ఆ రాష్ట్ర ప్రజలకు అందించారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో ఉత్తర్ ప్రదేశ్ కన్న మహారాష్ట్ర వెనుకబడి ఉంది. రాష్ట్రంలో అర్హులైన ప్రజల్లో 66.14 శాతం వారికి కనీసం ఒక డోసు వ్యాక్సిన్ ను అందించారు. 21.51 శాతం మంది రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ ను పొందారు. ఆ రాష్ట్ర జనాభాలో 9.78 కోట్ల మంది ఒక డోసు, 3.21 కోట్ల మంది రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. యూపీ కన్న మహారాష్ట్ర కరోనా వ్యాక్సిన్ విషయంలో వెనుకబడి ఉంది. ఆ రాష్ట్రం ఇంకా 10 కోట్ల డోసుల మార్కును చేరలేదు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేశారు. డిసెంబర్ 15 నాటికి రాష్ట్రంలో అర్హులైన అందరికీ వ్యాక్సిన్ అందించేలా ప్రణాళిక రూపొందించారు.

Read more RELATED
Recommended to you

Latest news