ప్రాంతీయ పార్టీల్లో ఉన్నట్లుగా…జాతీయ పార్టీల్లో ఒకే నాయకుడు మీద ఆధారపడి రాజకీయాలు నడవనే సంగతి తెలిసిందే. జాతీయ పార్టీల్లో ఏకనాయకత్వం అసలు ఉండదు…ఆ పార్టీల్లో ఎవరికి వారే నాయకులు అన్నట్లు పరిస్తితి ఉంటుంది. ఏదో జాతీయ అధిష్టానాలు చెప్పినట్లు రాజకీయం నడుస్తోంది. అయితే అదే ఒకోసారి ప్లస్ అయితే…మరొకసారి మైనస్ అవుతుంది. మొన్నటివరకు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్,బీజేపీల్లో అదే పరిస్తితి ఉంది.
అటు ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్‌కు అధినాయకుడుగా కేసీఆర్ దూసుకెళుతున్న విషయం తెలిసిందే. ఆయనకు చెక్ పెట్టడానికి కాంగ్రెస్, బీజేపీల్లో సరైన నాయకుడు లేరనే చెప్పాలి. గతంలో కాంగ్రెస్‌లో వైఎస్సార్ ఒక్కరే..వన్ మ్యాన్ షో చేశారు. ఆయన తర్వాత కాంగ్రెస్‌లో మరో నాయకుడుకు ఛాన్స్ దక్కలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆ అవకాశం దక్కిందనే చెప్పాలి. టిపిసిసి అధ్యక్షుడు అయ్యాక రేవంత్ దూకుడు ఎలా ఉందో చెప్పాల్సిన పని లేదు. ఆయనే…కేసీఆర్‌ని ఢీకొట్టగలిగే సరైన నాయకుడు అని అంతా భావిస్తున్నారు.
ఇటు బీజేపీ విషయానికొస్తే…అలా రేవంత్ మాదిరిగా కేసీఆర్‌ని ఢీకొట్టే నాయకులు కనిపించలేదు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నారు…కానీ ఆయనకు పూర్తి స్థాయిలో పట్టు లేదు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సత్తా గల నాయకుడే…కానీ దూకుడుగా రాజకీయాలు చేయరు. దాని వల్ల ఆయన కూడా కేసీఆర్‌ని ఢీకొట్టలేకపోయారు. కానీ ఇప్పుడు ఈటల రాజేందర్ రూపంలో బీజీపీకి..కేసీఆర్‌ని ఢీకొట్టే నాయకుడు దొరికారని చెప్పొచ్చు.
ఉద్యమ నేతగా ముందు నుంచి దూకుడుగా ఉన్న ఈటల…టీఆర్ఎస్‌లో ఎలా పనిచేశారో అందరికీ తెలిసిందే. అలాగే ఆయన్ని కేసీఆర్ ఏ విధంగా పార్టీ నుంచి బయటకు పంపారో కూడా తెలుసు. అలా బయటకొచ్చి హుజూరాబాద్‌లో సత్తా చాటి…ఇప్పుడు బీజేపీలో సీఎం అభ్యర్ధిగా తయారయ్యి…కేసీఆర్‌కు పోటీగా వచ్చారు. బీజేపీలో ప్రజలని ఆకర్షించే సత్తా ఎక్కువగా ఉన్న నాయకుడు ఈటల అనే చెప్పాలి. కాబట్టి ఈటల, రేవంత్‌లకు కేసీఆర్‌కు చెక్ పెట్టే సత్తా ఉంది. మరి వీరిలో ఎక్కువగా కేసీఆర్‌కు చెక్ పెట్టే సత్తా ఉందో చూడాలి.