యాదాద్రికి పోటెత్తిన భక్తుల.. దర్శనానికి గంటల సమయం

-

తెలంగాణ ప్రసిద్ధ యాదాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. లక్ష్మీ నరసింహ ఆలయాన్ని సందర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య మరింతగా పెరిగింది. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ నుంచి ప్రజలు ఎక్కువగా స్వామి వారిని దర్శించుకునేందుకు ఎక్కువ మంది వచ్చారు. స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయ క్యూ లైన్లు నిండిపోయాయి. మరోవైపు కార్తీక మాసం ప్రారంభం కావడంతో, కార్తిక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు.. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ధర్మ దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతుంది.

ఇదిలా ఉంటే భక్తులు విపరీతంగా రావడంతో యాదాద్రిలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. కొండపై ఆలయ అభివ్రుద్ధి పనులు జరగుతుండటంతో వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు. దీంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కార్తీక మాసం కావడంతో రానున్న రోజుల్లో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున ఆలయ అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ప్రసాద కౌంటర్ల సంఖ్యను పెంచారు.

Read more RELATED
Recommended to you

Latest news