సిక్కులకు గుడ్ న్యూస్… కర్తార్ పూర్ సాహిబ్ కారిడార్ పున: ప్రారంభానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

-

దేశంలో సిక్కు మతస్తులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. కర్తార్ పూర్ సాహిబ్ కారిడార్ ను పున:ప్రారంభించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను బుధవారం నవంబర్ 17 నుండి తిరిగి ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. వీసా రహిత 4.7-కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్ పాకిస్తాన్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను భారత సరిహద్దుతో కలుపుతుంది. గురునానక్ తన శేష జీవితాన్ని పాకిస్తాన్ లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ లోనే గడపారు. అందుకనే సిక్కులు దీన్ని అత్యంత పవిత్రమైన ప్రాంతంగా పరిగణిస్తారు. కోవిడ్ వల్ల గతంలో ఈ కారిడార్ ను మూసేశారు.

కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల అమిత్ షా ట్విట్టర్ లో’ కేంద్రం తీసుకున్న ఈనిర్ణయం పెద్ద సంఖ్యలో సిక్కు యాత్రికులకు సంతోషాన్ని కలిగిస్తుందని, ఈ నిర్ణయం శ్రీ గురునానక్ దేవ్ జీ పట్ల మోడీ  ప్రభుత్వానికి ఉన్న అపారమైన గౌరవాన్ని ప్రతిబింబిస్తుందని, నవంబర్ 19న శ్రీ గురునానక్ దేవ్ జీ ప్రకాష్ ఉత్సవ్‌ను జరుపుకోవడానికి దేశం సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం ప్రధాని మోడీ తీసుకున్న ఈ నిర్ణయం మరింత సంతోషాన్ని పెంచుతుంది‘ అని అన్నారు.

ఇటీవల పంజాబ్ బీజేపీ నేతలు కర్తార్ పూర్ సాహిబ్ కారిడాన్ ను తిరిగి ప్రారంభించాలని ప్రధాని మోదీని కోరారు. దీనికి ప్రత్యామ్నాయంగా వీసా అవసరమయ్యే వాఘా సరిహద్దు ద్వారా పాకిస్థాన్ చేరుకోవడంతో సిక్కు భక్తులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. దీంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2019లో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కర్తార్ పూర్ సాహిబ్ కారిడార్ ను ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news