రాజీ కుదిరినట్టేనా! కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి బ్రదర్స్ కొనసాగుతున్నట్టేనా?

-

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు. అవసరాలే కలుపుతుంటాయి. వీడ దీస్తుంటాయి. నిన్నటి వరకు తీవ్ర విమర్శలు చేసుకున్న వారు మరుసటి రోజు కౌగిలించుకునే వైచిత్రి పరిస్థితి రాజకీయాల్లో కనిపిస్తుంది. ఈ కల్చర్ కాంగ్రెస్‌లో ఎక్కువగా ఉంటుంది. నిన్నటివరకు ఉప్పూ నిప్పూగా ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటి‌రెడ్డి వెంకటి‌రెడ్డి ఒకే వేదిక మీదికి రావడం ఇందుకు నిదర్శనం. నిన్నటి వరకు కత్తులు దూసుకుని నేడు కరచాలనాలతో ఆ ఇద్దరు నేతలు హాట్ టాపిక్ అయ్యారు.

ప్రభుత్వం ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలనే డిమాండుతో కాంగ్రెస్ శనివారం ఇందిరాపార్కు ధర్నా చౌక్ ద్ద రెండు రోజుల వరి దీక్షను ప్రారంభించింది. ఇక్కడ దీక్ష కంటే రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డిల హాట్ టాపిక్‌గా మారారు. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ఎన్నికైన సమయంలో కోమటిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్‌ కూడా దక్కకపోవడంపై రేవంత్‌రెడ్డినే బోనులో నిలబట్టే ప్రయత్నం చేశారు. ఆరోజు నుంచే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. వరిదీక్షలో పక్కపక్కనే కూర్చొని సరదాగ మాట్లాడుకోవడం చర్చనీయాంశమైంది.

రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిల మధ్య సయోధ్య కుదర్చడం కోసం సీనియర్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, అవి ఫలించాయనే ప్రచారం జరుగుతోంది. అందుకే వరి దీక్ష వద్దకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది.

కాంగ్రెస్ పార్టీలో నల్లగొండ అంటే కోమటిరెడ్డి బద్రర్స్. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే నల్లగొండ. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నల్లగొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత పార్టీ ఆదేశాల మేరకు ఎంపీగా పోటీ చేసి నల్లగొండ నుంచి కోమటిరెడ్డి విజయం సాధించాడు. జిల్లా రాజకీయాల్లో అంతలా ముద్ర వేసిన కోమటిరెడ్డి బ్రదర్స్‌ను దూరంగా చేసుకుంటే ఏమి జరుగుతుందో కాంగ్రెస్ పార్టీ తెలుసు. అందుకే, పట్టు విడుపుల ధోరణితో రాజీకి వచ్చినట్లు తెలుస్తున్నది.

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వరి దీక్ష వద్దకు వచ్చినా రాజగోపాల్‌రెడ్డి మాత్రం దూరంగా ఉన్నారు. ముందు నుంచీ రాష్ట్రంలో కాంగ్రెస్ విధానాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. హుజరాబాద్ ఉప ఎన్నికల బీజేపీ గెలుపు జోష్ తర్వాత రాష్ట్రంలో వచ్చే మరో ఉప ఎన్నిక మునుగోడు అనే ప్రచారం సైతం జరుగుతున్నది. ఇలాంటి సమయంలో రేవంత్‌రెడ్డికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మద్దతు తెలుపడం కీలక పరిణామం. రాజీ కుదుర్చుకుని కాంగ్రెస్‌లోనే కోమటిరెడ్డి బ్రదర్స్ కొనసాగుతారా లేదా అనే విషయం మరికొంత కాలం ఆగితే తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news