ప్రపంచాన్ని వణికిస్తున్న ఓమిక్రాన్ వేరియంట్ వైరస్ ఇండియాలోకి ఎంటరైంది. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఓమిక్రాన్ వైరస్ ను గుర్తించారు. ప్రపంచంతో 29 దేశాలకు ఓమిక్రాన్ వేరియంట్ పాకింది. తాజాగా ఈ జాబితాలో ఇండియా కూడా చేరింది.
అయితే ఆనందించాల్సిన విషయం ఏమిటంటే.. ప్రస్తుతం ఓమిక్రాన్ వేరియంట్ సోకిన ఇద్దరికి స్వల్ప స్థాయిలో లక్షణాలు మాత్రమే ఉన్నాయని కేంద్రం వెల్లడించిది. ఇప్పటి వరకు ప్రపంచంలో 373 కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఓమిక్రాన్ వేరియంట్ లో ఒక్కరూ కూడా మరణించలేదు. ఈ వేరియంట్ ను గుర్తించేందుకు దేశంలో మొత్తం 37 ల్యాబోరేటరీలను ఏర్పాటు చేశామని కేంద్రం ప్రకటించింది. విదేశాల నుంచి వచ్చే ప్రతీ ఒక్కరికి ఆర్టీపీసీఆర్ టెస్టులను తప్పనిసరి చేశామని… ప్రోటోకాల్ ప్రకారం చికిత్స అందిస్తున్నామని కేంద్ర హెల్త్ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ వెల్లడించారు.
మరోవైపు యువకులకే ఎక్కువగా ఓమిక్రాన్ సోకుతోందని సౌతాఫ్రికా తెలిపింది. దీంతో ప్రపంచ దేశాల్లో కలవరం ఏర్పడింది. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండే యువతలో ఓమిక్రాన్ వస్తుండటం అంతుచిక్కడం లేదని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.