గ్రేటర్ పరిధిలో రిజర్వాయర్ల వద్ద గట్టి భద్రత… ఇటీవల ట్యాంకులో కుళ్లిన మృతదేహం ఘటనతో అప్రమత్తం

-

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని జలాశయాల వద్ద గట్టి భద్రను ఏర్పాటు చేస్తున్నారు జలమండలి అధికారులు. ఇటీవల ట్యాంకులో కుళ్లిన మృతదేహం రావడంతో అధికారులు భద్రత చర్యలు తీసుకుంటున్నారు. అన్ని రిజర్వాయర్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి.. నిఘా పరిధిలోకి తేనున్నారు.రిజర్వాయర్ల వద్ద పర్యవేక్షణ, భద్రతపై జలమండలి ఎండీ దానా కిశోర్ ఆరా తీశారు. నగరంలో మొత్తం 378 సర్వీసు రిజర్వాయర్ల వద్ద 24 గంటలు నిఘా పెట్టనున్నారు.

ఇటీవల నగరంలోని ముషిరాబాద్ పరిధిలోని రిసాలగడ్డ రిజర్వాయర్ లో కుళ్లిన మృతదేహం బయటపడిన నేపథ్యంలో గ్రేటర్ అధికారులు ఈ చర్యలు తీసుకుంటున్నారు. దాదాపు వారం రోజుల పాటు ఆ ఏరియా ప్రజలు మృతదేహం పడి ఉన్న నీటినే తాగారు. దుర్వాసన వస్తుందని చూడగా ట్యాంకులో మృతదేహం ఉండటం స్థానికులు గమనించారు. దీంతో ఒక్కసారిగా ఆ ఏరియా వాసుల్లో భయాందోళన నెలకొంది. అయితే నీటిని తాగిన వారిలో కొంతమందికి వాంతులు, విరోచనాలు అయ్యాయి. ట్యాంకు నీటిని నిలిపివేసి… ట్యాంకర్ల ద్వారా కాలనీవాసులకు తాగునీటిని అందించారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news