కేరళలో తొలి ఓమిక్రాన్ కేసు నమోదు.. దేశంలో 38 కి చేరిన ఓమిక్రాన్ కేసుల సంఖ్య

-

దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య వేగంగా విస్తరింస్తోంది. దక్షిణాఫ్రికాలో మొదలైన ఓమిక్రాన్ 60కి పైగా దేశాల్లో విస్తరించింది. దేశంలో ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న కేసుల సంఖ్య దేశంలో పెరగుతోంది. తాజాగా ఇవ్వాళ ఒక్కరోజే 5 కేసులు పెరిగాయి. తాాజాగా ఇండియాలో కేసుల సంఖ్య 38కి చేరింది. విదేశాల నుంచి వచ్చే వారిపై నిఘా పెంచినా.. కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

తాజాగా కేరళ రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైంది. డిసెంబర్ 6న యూకే నుంచి కేరళకి వచ్చిన వ్యక్తికి డిసెంబర్ 8న కరోనా సోకింది. ఆయన శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ పంపించగా… ఓమిక్రాన్ పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ఇవ్వాళ ఒక్కరోజే కేరళలో 1, ఏపీలో 1, నాగ్ పూర్ లో1, ఛండీగడ్  లో1, కర్ణాటకలో 1కేసు నమోదైంది. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే మహారాష్ట్రలో 18, రాజస్థాన్ లో9, కర్ణాటకలో 3, గుజరాత్ లో 3, ఢిల్లీలో 3, కేరళలో ఒకటి, ఏపీలో 1 కేసు నమోదైంది. ఇప్పటికే ఒమిక్రాన్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news