నిరుద్యోగుల‌కు జ‌గ‌న్ శుభ‌వార్త‌.. వైద్య‌శాఖ‌లో ఖాళీల భ‌ర్తీకి ఆదేశాలు

-

ఏపీ నిరుద్యోగుల‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభ‌వార్త చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది నియామకానికి తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగిన సీఎం జ‌గ‌న్‌.. ఫిబ్రవరి చివరి కల్లా మొత్తం నియామ‌కాల ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని ఆదేశించారు. అలాగే… జనవ‌రిలోగా అందరికీ
క‌రోనా డబుల్‌ డోస్‌ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

ఇవాళ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. క‌రోనా పై స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… వ్యాక్సినేషన్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయడమే కోవిడ్‌ నివారణలో ఉన్న పరిష్కారమ‌ని తెలిపారు. కొత్త మెడికల్‌కాలేజీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. ఆరోగ్య శ్రీ సేవలు ఏ ఆస్పత్రిలో దొరుకుతాయనే విషయం అందరికీ అవాగాహన కల్పించాలని.. గ్రామ సచివాలయాల్లో సంబంధించిన హోర్డింగ్స్‌ పెట్టాలని చెప్పారు. విలేజ్‌ క్లినిక్స్‌ రిఫరల్‌ పాయింట్ కావాలని వెల్ల‌డించారు.అలాగే.. పాడేరు, అరుకుల్లో అనస్తీషియా, ఆప్థాలమిక్‌ మరియు ఈఎన్‌టీ ఏర్పాటుకు సీఎం జ‌గ‌న్‌ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. సమర్థవంతంగా ఆరోగ్య శ్రీ సేవలకు ప్రత్యేక యాప్ ను అమ‌లు చేయాల‌ని.. ఇందులో సందేహాలను నివృత్తి చేసే ఏర్పాటూ ఉండాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news