ప్రధాని మోదీకి .. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోన్..

-

భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియాలో పర్యటించారు. ఈనెల 6న ఢిల్లీకి వచ్చిన ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించారు. ఈ చర్చల్లో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడేలా ఇరు నేతలు చర్చలు జరిపారు. తాజాగా సోమవారం రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. ఇటీవల భారత్ కు వచ్చిన రష్యా ప్రతినిధి బృందానికి అందించిన ఆతిథ్యానికి ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. దీంతో పాటు ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ విషయాలపై ఇరు దేశాల నేతలు మాట్లాడుకున్నారు.

ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను వాటి అమలు గురించి ఇరు నేతలు చర్చించారు. రష్యా మరియు భారతదేశం మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య సంబంధాల అభివృద్ధి చెందాలని ఇరు దేశాల నేతలు ఆకాంక్షించారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని పరిస్థితులతో పాటు అంతర్జాతీయ స్థిరత్వం, భద్రత సమస్యలపై ఇరుదేశాల నేతలు మాట్లాడినట్లు సమాచారం. రాబోయే నూతన సంవత్సర పురస్కరించుకుని అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news