త్వరలోనే కాంగ్రెస్ పార్టీని బీజేపీలో కలుపబోతున్నారని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్.. బిజేపి పై పోరాటం చేయడంలేదని నిప్పులు చెరిగారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఏకవచన సంబోధన సరికాదని.. విత్తనాల కోసం కేసీఆర్ ఫామ్ హౌజ్ లో వరి వేశారని స్పష్టం చేశారు. వ్యక్తిగత అవసరాల కోసం వరి పంట వేసుకున్నారని… దాని వల్ల ఎవరికి నష్టం లేదన్నారు.
JAN
టీపీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి.. వరి పై ఢిల్లీలో యుద్ధం చేయాలని చురకలు అంటించారు. కాంగ్రెస్ నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదని.. ఈ దేశంలో రైతులకు, వ్యవసాయానికి గౌరవాన్ని పెంచింది కేసీఆర్ అని పేర్కొన్నారు. అందరూ వ్యవసాయ రంగాన్ని విస్మరిస్తే.. వ్యవసాయానికి కేసీఆర్ వన్నె తెచ్చారని వెల్లడించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను విరుద్ధంగా కొందరు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో వ్యవసాయాన్ని అగ్రభాగాన నిలిపింది తెలంగాణ ప్రభుత్వమని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఖర్చు చేస్తోందని వెల్లడించారు.