ప్రతి పక్షాలు రైతుల్ని రెచ్చగొడుతున్నాయి… వరిని సాగు చేస్తే రైతులు నష్టపోవడం ఖాయం- నిరంజన్ రెడ్డి..

-

వరిసాగు పై ప్రతిపక్షాలు బీజేపీ, కాంగ్రెస్ అవలంభిస్తున్న విధానాలపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతి పక్షాలు వరివేసేలా రైతుల్ని రెచ్చగొడుతున్నాయంటూ మండిపడ్డారు. రైతులు వరిని సాగు చేస్తే నష్టపోవడం ఖాయమని హెచ్చిరించారు. ఎవరైతే సీడ్ కోసం, మిల్లర్లతో ఒప్పంద ఉంటే.. వారు నిరభ్యంతరంగా వరిని సాగు చేసుకోవచ్చని తెలిపారు మంత్రి.  రైతులకు అన్యాయం చేస్తుంది బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వమే అని విమర్శించారు. కేంద్రమే యాసంగి వడ్లను కొనుగోలు చేయకుండా రైతులను మోసం చేస్తుందని విమర్శించారు. ముఖ్యమంత్రి దీక్ష చేసి కేంద్రం తీరును ఎండగట్టారని అన్నారు. కాంగ్రెస్, పీసీసీ అధ్యక్షుడు బాధ్యతాయుతంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్.. వరిని వేయాలంటూ రైతుల్ని రెచ్చగొడుతుందని విమర్శించారు. ముఖ్యమంత్రిని పట్టుకుని ఏకవచనంతో సంభోదిస్తున్నారంటూ.. ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్ వల్లే తెలంగాణలో వ్యవసాయానికి పునర్వైభవం వచ్చిందని నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుల సంక్షేమం కోసం ఏటా రూ. 60 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. రైతుల్లో ఆత్మగౌరవం నెలకొల్పింది కేసీఆరే అని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news