జమ్మూ కాశ్మీర్ లో రెండు వేరు వేరు ఎన్ కౌంటర్లు…. ఆరుగులు ఉగ్రవాదుల హతం..

-

జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలకు భారీ విజయం లభించింది. రెండు వేరు వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్ కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ లో వరసగా ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. తాజాగా అనంత్ నాగ్, కుల్గామ్ జిల్లాల్లో ఎన్ కౌంటర్ల చోటు చేసుకున్నాయి. ఉగ్రవాదులున్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు, పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ఈ రెండు ఎన్ కౌంటర్లు చోటు చేసుకున్నాయి.

కుల్గామ్ జిల్లాలోని నౌగామ్ అనంత్‌నాగ్ మరియు మిర్హామా గ్రామంలో  బ్యాక్ టూ బ్యాక్ ఎన్ కౌంటర్లు చోటు చేసుకున్నాయి. మొదటి ఎన్‌కౌంటర్ నౌగామ్ అనంత్‌నాగ్‌లో ప్రారంభమైంది. అక్కడ జరిగిన ఎదురుకాల్పుల్లో పాక్ ఉగ్రవాది సహా ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ రెండు ఘటనల్లో మొత్తం 6 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందులో ఇప్పటి వరకు నలుగురు ఉగ్రవాదులను అధికారులు గుర్తించారు. ఇందులో ఇద్దరు పాకిస్థానీలు కాగా.. మరో ఇద్దరు కాశ్మీర్ ప్రాంతానికి చెందిన వారు. మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉంది. వీరంతా జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారు.

Read more RELATED
Recommended to you

Latest news