ఆస్తమా సమస్యతో బాధపడే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చలికాలంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. అలాగే జలుబు, దగ్గు మొదలైన సమస్యలు వస్తాయి. అయితే ఆస్తమా తో బాధపడే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు చలికాలంలో తీసుకుంటే మంచిది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా కనుక మీరు పాటిస్తే ఖచ్చితంగా చలికాలంలో ఆస్తమా వల్ల ఇబ్బందులు రావు. అయితే మరి ఎటువంటి ఆలస్యం లేకుండా దాని గురించి చూసేద్దాం.
ఇన్ హేలర్ ని వాడండి:
డాక్టర్ ని కన్సల్ట్ చేసి చేసే రెగ్యులర్ గా ఇన్హేలర్ ని వాడితే సమస్య తగ్గుతుంది. ఇన్హేలర్ ని వాడడం వల్ల ఆస్తమా త్వరగా కంట్రోల్ అవుతుంది.
స్మోకింగ్ చెయ్యకండి:
చాలామందికి స్మోకింగ్ బాగా అలవాటు. అయితే నిజానికి స్మోకింగ్ వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలానే మీరు స్మోకింగ్ చేయడం మాత్రమే కాకుండా స్మోకింగ్ చేసే వాళ్ళకి దూరంగా వున్నా కూడా ఆస్తమా సమస్య మరింత ఎక్కువ అవుతుంది.
వీటికి దూరంగా ఉండాలి:
కట్టెల పొయ్యి నుండి వచ్చే పొగ, అగరుబత్తుల పొగ మొదలైన వాటికి దూరంగా ఉంటే మంచిది. వీటి వల్ల కూడా ఆస్తమా సమస్య మరింత ఎక్కువ అవుతుంది.
బయట వ్యాయామం చెయ్యదు:
చలికాలంలో చలి ఎక్కువగా ఉంటుంది అటువంటి సమయంలో మీరు బయట వ్యాయామం చేశారంటే ఆస్తమా ఎటాక్ వస్తుంది కాబట్టి ఉదయాన్నే లేచి చలిగాలిలో వ్యాయామం చేయడం వాకింగ్ చేయడం లాంటివి చేయొద్దు.
వెచ్చగా వుండే దుస్తులు ధరించండి:
చలిగాలి ఎక్కువ గా తగలకుండా మీరు వెచ్చగా వుండే దుస్తులు వేసుకోండి అదేవిధంగా రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు తీసుకోవడం లాంటివి చేయండి. ఇలా ఈ విధంగా చేయడం వల్ల ఆస్తమా నుంచి బయటపడి పోవచ్చు. దీంతో ఏ ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. లేదంటే చలికాలంలో దీని వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.