ఓ వైపు రచ్చ చేస్తూ..మరోవైపు ఇదంతా పార్టీలో ఐక్యత కోసం చేస్తున్నానని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పే లాజిక్ ఏ మాత్రం నమ్మశక్యంగా లేదని రాజకీయ విశ్లేషకులే కాదు….సొంత పార్టీ శ్రేణులే మాట్లాడుకుంటున్నాయి. అసలు రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి వచ్చిన దగ్గర నుంచి జగ్గారెడ్డి ఏ స్థాయిలో, ఆయన్ని టార్గెట్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
సరే అధ్యక్ష పదవి ఎవరికొకరికి ఇచ్చారని చెప్పి…మిగతా నేతలు అడ్జస్ట్ అయ్యి పార్టీ కోసం పనిచేస్తున్నారు. కానీ జగ్గారెడ్డి మాత్రం ఎప్పుడు ఏదొక రచ్చని తెరపైకి తీసుకోస్తూనే ఉన్నారు. అప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నిక సమయంలో కావొచ్చు…తాజాగా రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమం చేయడానికి సిద్ధమైనప్పుడు గానీ…రచ్చ లేపుతూనే ఉన్నారు. ఆ కార్యక్రమానికి తనని ఆహ్వానించలేదని చెప్పి…ఏకంగా సోనియా గాంధీకి జగ్గారెడ్డి లేఖ రాసి, రేవంత్‌ని పిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
ఓ వైపు రేవంత్ ఏమో కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేస్తుంటే..దాన్ని చెడగొడుతూ జగ్గారెడ్డి, రేవంత్‌పై పోరాటం చేయడం ఏంటని సొంత పార్టీ శ్రేణులే రగిలిపోతున్నారు. అసలు ఈయన పార్టీని బాగు చేయడం కంటే నాశనం చేస్తున్నట్లు కనిపిస్తోందని, జగ్గారెడ్డి టీఆర్ఎస్ కోవర్టు అన్నట్లు ప్రచారం మొదలైంది. దీనిపై జగ్గారెడ్డి సీరియస్‌గానే స్పందించారు…అసలు తాను పార్టీకి కట్టు బానిసని అని, ఐక్యత కోసమే తన తపన అని, రేవంత్ ఒంటెద్దు పోకడలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడమే తన ప్రయత్నమని, ఇంత చేస్తుంటే కోవర్ట్ అనే ముద్ర వేస్తారా? ఇదెక్కడి న్యాయమని జగ్గారెడ్డి ఫైర్ ఆవుతున్నారు.
కానీ ఇక్కడే జగ్గారెడ్డి కొన్ని లాజిక్‌లు మిస్ ఆవుతున్నారు. రేవంత్ ఒంటెద్దు పోకడలు జగ్గారెడ్డి ఒక్కరికే కనిపిస్తున్నాయా? సరే పార్టీలో ఇబ్బందులు ఉంటే అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలి..కానీ ఇలా రోడ్డుకెక్కి..ఐక్యత అంటే ఎవరు నమ్మే పరిస్తితిలో లేరు. కాబట్టి జాగ్గారెడ్డి వైఖరి కాంగ్రెస్‌లో అనుమానాస్పదంగానే ఉం