కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్ల మార్కెటింగ్ కు డీసీజీఐ అనుమతి

-

కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్ల మార్కెటింగ్ విక్రయాలకు అనుమతి ఇస్తూ.. డ్రగ్ కంట్రోలర్ సంస్థ డీసీజీఐ  కీలక నిర్ణయం తీసుకుంది. అయితే షరతులతో కూడిన అనుమతిని మాత్రమే ఇచ్చింది. మెడికల్ స్టోర్లలో వ్యాక్సిన్లు అందుబాటులో ఉండవని… ఆసుపత్రులు మరియు క్లినిక్‌లు వ్యాక్సిన్‌లను కొనుగోలు చేయవచ్చని తెలిపింది. టీకా డేటా ప్రతి ఆరు నెలలకు డీసీజీఐకి సమర్పించాలని.. కోవిన్ యాప్ లో  కూడా డేటా అప్‌డేట్ చేయాలనే షరతులును విధించింది.

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ మొదలైనప్పటి నుంచి ప్రజలకు ఎక్కువగా కోవీషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లను ఇస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు వ్యాక్సిన్లు కరోనాపై సమర్థవంతంగా పనిచేస్తున్నాయని పలు అధ్యయనాలు తెలియజేశాయి. కోవీషీల్డ్ ను పూణేలోని సీరం ఫార్మా సంస్థ తయారు చేస్తుండగా… కోవాగ్జిన్ ను హైదరాబాద్ బేస్డ్ భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news