34 ఏళ్లు పూర్తి చేసుకున్న తెలుగింటి సోయగం..ఇంకా చెప్పాలంటే తెలంగాణ సోయగం ఈషా రెబ్బ ఇవాళ తనని తాను నిరూపించుకోవాలని పరితపిస్తోంది. ఆ విధంగా అవకాశాలను వెతుక్కుంటోంది. ఆమెకు తెలుగుతో పాటు చాలా తెలుసు .. కొందరికి తెలుగు తెలియదు కానీ చాలా తెలుసు అన్న నమ్మకమో, పొగరో ఉన్నాయి. కొన్ని సినిమాల్లో నటించాక ఆమె విశ్వాసం గెలిచింది.
ఆత్మ విశ్వాసం రెట్టింపు అయింది.ఇంకా కెరియర్ బ్రేక్ రావడం ఒక్కటే మిగిలి ఉంది. ఏదేమయినా వన్ ఫిల్మ్ వండర్ -అన్న విధంగా తన కెరియర్ ఉండకూడదనే అనుకుంటోంది. అందుకు తగ్గ విభిన్నతను పాటించేందుకు ప్రయత్నిస్తోంది. అన్నీ ఫలిస్తే టాలీవుడ్ వెబ్ సిరీస్ లకు ఆమె బెస్ట్ ఛాయిస్.బాలీవుడ్ భామలను కూడా పక్కకు తోసేసి నటించే దమ్మున్న భామ. అందం మరియు ప్రతిభ అన్నవి ఆమెకు అదనపు ఆకర్షణలు.
కాస్త తెలివితో ఆరా తీస్తే తెలుగు తెలిసిన అమ్మాయిలు ఎక్కడో ఆగిపోతున్నారు.తెలుగు తెలియని అమ్మాయిలు ఎక్కడి నుంచో వచ్చి రెచ్చిపోతున్నారు.ఇబ్బంది అంతా భాషతోనే కదా! అవును తెలిసిన వారు తెలియని వారు చూశారా ఏదో ఒకటి వార్ నడుస్తుంది కదా! కనుక మన సినిమాల్లో నటించి పూజా హెగ్డే సొంతింటి కలను సాకారం చేసుకుంది. మన సినిమాల్లో నటించి ఎక్కడో ఓ స్థాయికి పోయింది సమంత.
మన సినిమాల్లో నటించి ఇప్పుడిప్పుడే హొయలు పోతోంది రకుల్ లేదా పాయల్..ఇలా చాలామంది తెలుగు తెలియకుండా డబ్బులు తెచ్చుకుంటున్నారు. పాపం తెలుగు తెలిసినా అభినయం తెలిసినా ఆ అమ్మాయికి అవకాశాలే రావడం లేదు. ఈషా రెబ్బా అందంతో పాటు హృదయం కూడా మాట్లాడగలదు.. హృదయంతో మాట్లాడగలదు.
తెలుగు తెలిసిన వారంతా తెలుగు కథలకు నాయకిలు కావాల్సిన అవసరం లేదు.తెలుగు సినిమాలకు వారి అవసరం ఉంటుందని అనుకునేందుకు లేదు. అయినా కూడా తెలుగు అమ్మాయిలు పట్టు విడువక కాస్తయిన ప్రయత్నాలు చేస్తే అప్పుడప్పుడూ అయినా అందానికి ప్రాధాన్యం అభినయానికి అవకాశం తెరపై వెలుగులు చిమ్మేందుకు ఓ సందర్భం తప్పక వస్తాయి. ఆ విధంగా ఈషా రెబ్బా అనే తెలుగు అమ్మాయి తనదైన పంథాలో దూసుకుపోతోంది.
ఈషా రెబ్బా అరవింద సమేతలో మెరిసింది. అంతకుముందు కొన్ని సినిమాల్లో మెరిసింది. అంతకు ముందు ఆ తరువాత అంటూ కూడా మెరిసింది. ఎన్నిసార్లు మెరిసినా కూడా రావాల్సిన బ్రేక్ రావడం లేదు. రావాల్సినంత పేరు రావడం లేదు. ఆ విధంగా ఆమె వెనుకబడి పోతున్నారన్న బాధ అభిమానుల్లోనూ ఉంది. అయినా మనకు బాలీవుడ్ బ్యూటీలు వారి అందాలూ కావాలి కానీ ఎవరికి కావాలి సొంతింటి అందాలూ సొంతింటి సోయగాలూ..?