RADHE SHYAM : ప్రభాస్ ఫ్యాన్స్‌ కు గుడ్‌ న్యూస్‌.. ‘రాధేశ్యామ్’ రిలీజ్ డేట్ ఫిక్స్‌

-

ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కు అదిరిపోయే శుభవార్త అందింది. ప్రభాస్‌ తాజాగా నటించిన రాధేశ్యామ్‌ మూవీ రిలీజ్‌ డేట్‌ ను ఫిక్స్‌ చేసింది చిత్ర బృందం. మార్చి 11 వ తేదీన రాధే శ్యామ్‌ మూవీని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు అధికారికంగా ఓ పోస్టర్‌ కూడా విడుదల చేసింది.

కరోనా కారణంగా గతంలో తమ సినిమాను వాయిదా వేసుకున్నామని.. ఇప్పుడు కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో.. తమ సినిమా ను విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. ఇక ఈ అప్డేట్‌ తో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ లో నూతన ఉత్సాహం నెలకొంది.కాగా.. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ రాధేశ్యామ్ సినిమా వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా కు రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంది. అయితే ఈ సినిమా భారీ గ్రాఫిక్స్ తో రానుంద‌ని తెలుస్తుంది. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సింది కానీ.. కరోనా నేపథ్యంలో వాయిదా పడింది.

 

Read more RELATED
Recommended to you

Latest news