నేటి నుంచి రామానుజాచార్యుల సహస్రాబ్ధి వేడుకలు… 12 రోజుల కార్యక్రామాలు ఇవే…

-

నేటి నుంచి 12 రోజుల పాటు రామానుజాచార్యుల సహస్రాబ్ధి వేడుకలు జరుగనునున్నాయి. దీంతో ఉత్సవాలకు కేంద్రంగా ఉన్న శంషాబాద్ లోని ముచ్చింతల్ దివ్యక్షేత్రం అందంగా ముస్తాబవుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 216 అడుగుల ఎత్తులో నిర్మించిన రామానుజాచార్యుల విగ్రహాన్ని వైభవంగా ఆవిష్కరించనున్నారు. చిన్నజీయర్ స్వామి స్వయం పర్యవేక్షణలో ఈ సహస్రాబ్ధి వేడుకలు జరుగనున్నాయి. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఉత్సవాలకు అంకురార్పణ జరుగనుంది.

ఈ వేడుక కోసం రాష్ట్రం ప్రభుత్వం కూడా సిద్ధం అయింది. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపనుంది. పటాన్ చెరు నుంచి గచ్చిబౌలి మీదుగా, కేపీహెచ్ బీ నుంచి మెహదీ పట్నం మీదుగా.. మేడ్చల్ నుంచి బాలానగర్ మీదుగా, అల్వాల్ నుంచి జేబీఎస్, ఆర్టీసీ ఎక్స్ రోడ్, అప్టల్ గంజ్ మీదుగా, కాచిగూడ, నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల నుంచి ప్రత్యేకంగా బస్సులను నడుపనుంది.

సహస్రాబ్ధి వేడుకలు షెడ్యూల్

2-Feb-2022 బుధవారం ఉదయము
శోభాయాత్ర
వాస్తుశాంతి,
ఋత్విక్ వరణ
– – –
2-Feb-2022 బుధవారం సాయంకాలము అంకురార్పణ – – –
3-Feb-2022 గురువారం
ఉదయము అరణిమథనం
అగ్నిప్రతిష్ఠా,
హోమాలు దుష్టనివారణకై – శ్రీసుదర్శనేష్టి,
సర్వాభీష్టసిద్ధికై – శ్రీవాసుదేవేష్టి శ్రీశ్రీశ్రీ పెద్దస్వామివారి అష్టోత్తరశతనామపూజ,
ప్రవచనములు –
3-Feb-2022 గురువారం
సాయంకాలము హోమములు – ముఖ్యఅతిథుల సందేశములు –
4-Feb-2022 శుక్రవారం
ఉదయము – ఐశ్వర్యప్రాప్తికై – శ్రీలక్ష్మీనారాయణేష్టి,
సత్‌సంతానమునకై – వైనతేయేష్టి శ్రీలక్ష్మీనారాయణ అష్టోత్తరశతనామపూజ,
ప్రవచనములు –
4-Feb-2022 శుక్రవారం సాయంకాలము – – ముఖ్యఅతిథుల సందేశములు –
5-Feb-2022 శనివారం
వసంతపంచమి
ఉదయము – విజయప్రాప్తికై – విష్వక్సేనేష్టి,
విద్యాప్రాప్తికై – శ్రీహయగ్రీవేష్టి శ్రీవేంకటేశ అష్టోత్తరశతనామపూజ,
ప్రవచనములు
భారతదేశ ప్రధాన మంత్రి “శ్రీ నరేంద్ర మోడి” గారిచే శ్రీ రామానుజ 216 అడుగుల విగ్రహ ఆవిష్కరణ
5-Feb-2022 శనివారం
సాయంకాలము – – ముఖ్యఅతిథుల సందేశములు –
6-Feb-2022 ఆదివారం
ఉదయము – తీవ్ర వ్యాధులనివారణకై – పరమేష్టి
పితృదేవతాతృప్తిద్వారా,
విఘ్న నివారణకై – వైభవేష్టి శ్రీరామ అష్టోత్తరశతనామపూజ,
ప్రవచనములు –
6-Feb-2022 ఆదివారం
సాయంకాలము – – ముఖ్యఅతిథుల సందేశములు –
7-Feb-2022 సోమవారం
ఉదయము – అకాలవృష్టినివారణకై, సస్యవృద్ధికై – వైయ్యూహికేష్టి.
వ్యక్తిత్వవికాసానికై, ఆత్మోజ్జీవనకై శ్రీకృష్ణ అష్టోత్తరశతనామపూజ,
ప్రవచనములు –
7-Feb-2022 సోమవారం
సాయంకాలము – – ముఖ్యఅతిథుల సందేశములు –
8-Feb-2022 మంగళవారం
రథసప్తమి
ఉదయము – దుష్టగ్రహబాధానివారణకై – శ్రీనారసింహేష్టి.
జ్ఞానాజ్ఞానకృతసర్వవిధపాప నివారణకై – శ్రీమన్నారాయణేష్టి. శ్రీనారసింహ అష్టోత్తరశతనామపూజ
సామూహిక ఆదిత్యహృదయ పారాయణ
ధర్మాచార్య సదస్సు –
8-Feb-2022 మంగళవారం
సాయంకాలము – – ముఖ్యఅతిథుల సందేశముల –
9-Feb-2022 బుధవారం
ఉదయము – ఐశ్వర్యప్రాప్తికై – శ్రీలక్ష్మీనారాయణేష్టి
సత్‌సంతానమునకై – వైనతేయేష్టి శ్రీహయగ్రీవ అష్టోత్తరశతనామపూజ,
ధర్మాచార్య సదస్సు –
9-Feb-2022 బుధవారం
సాయంకాలము – – ముఖ్యఅతిథుల సందేశముల –
10-Feb-2022 గురువారం
ఉదయము – అకాలవృష్టినివారణకై, సస్యవృద్ధికై – వైయ్యూహికేష్టి.
దుష్టగ్రహబాధానివారణకై-శ్రీనారసింహేష్టి శ్రీరామానుజ అష్టోత్తరశతనామపూజ,
ప్రవచనములు –
10-Feb-2022 గురువారం
సాయంకాలము – – ముఖ్యఅతిథుల సందేశముల –
11-Feb-2022 శుక్రవారం
ఉదయము సామూహిక ఉపనయనములు విద్యాప్రాప్తికై – శ్రీహయగ్రీవేష్టి. వ్యక్తిత్వవికాసానికై, ఆత్మోజ్జీవనకై ప్రవచనములు –
11-Feb-2022 శుక్రవారం
సాయంకాలము – – ముఖ్యఅతిథుల సందేశముల –
12-Feb-2022 శనివారం
ఉదయము
భీష్మైకాదశీ – తీవ్ర వ్యాధులనివారణకై – పరమేష్టి.
పితృదేవతా తృప్తిద్వారా
విఘ్ననివారణకై – వైభవేష్టి పరవాసుదేవ అష్టోత్తరశతనామపూజ, అష్టోత్తరశతదివ్యదేశనామార్చన,
ప్రవచనములు భారతదేశ రాష్త్రపతి “శ్రీ రాం నాథ్ కోవింద్” గారిచే బంగారపు రామనుజ విగ్రహ ఆవిష్కరణ
12-Feb-2022 శనివారం
సాయంకాలము – – ముఖ్యఅతిథుల సందేశముల –
13-Feb-2022 ఆదివారం
ఉదయము సువర్ణ పుష్పార్చన విజయప్రాప్తికై – విష్వక్సేనేష్టి.
జ్ఞానాజ్ఞానకృతసర్వవిధపాప నివారణకై – శ్రీమన్నారాయణేష్టి – –
13-Feb-2022 ఆదివారం
సాయంకాలము – – ముఖ్యఅతిథుల సందేశములు –
14-Feb-2022 సోమవారం
ఉదయము మహాపూర్ణాహుతి,
కుంభప్రోక్షణ,
ప్రథమారాధన,
ప్రథమ దర్శనము
మహాపూర్ణాహుతి – –
14-Feb-2022 సోమవారం
సాయంకాలము –

Read more RELATED
Recommended to you

Latest news