మాటల మాంత్రికుడు త్రివిక్రం, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో భారీ అంచనాలతో వస్తున్న సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. హారిక హాసిని క్రియేషన్స్ తో పాటుగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కథ ఒకటి సోషల్ మీడియాలో సంచరిస్తుంది. తండ్రి కొడుకుల సెంటిమెంట్ స్టోరీగా వస్తున్న ఈ సినిమాలో హీరో ఓ అబద్ధం ఆడతాడట. దానితో విలన్ కు హీరో టార్గెట్ అవుతాడట.
విలన్ హీరో కోసం వెతుకుతున్న తరుణంలో హీరో చెప్పిన అబద్ధం నిజమే అని తెలుస్తుందట. మొత్తానికి త్రివిక్రం, బన్ని హ్యాట్రిక్ కాంబోలో చేస్తున్న ఈ సినిమా కథ బాగుందన్న టాక్ వచ్చింది. అయితే ఇది నిజంగా ఆ సినిమా కథేగా కాదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు టైటిల్ గా నాన్న నేను అని పెట్టాలని చూస్తున్నారట. సినిమా సెట్స్ మీదకు వెళ్లని బన్ని సినిమాపై వస్తున్న ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అన్నది చూడాలి.