భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు హైదరాబాద్ కు రానున్నారు. ప్రధాని మోడీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానం ద్వారా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వస్తారు. అక్కడి నుంచి ప్రధాని మోడీ 2:45 గంటలకు పటాన్ చెరు కు వెళ్తారు. పటాన్ చెరులోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో ఆయన పాల్గొంటారు. దీని తర్వాత సాయంత్రం 4:30 గంటలకు రంగారెడ్డి ముచ్చింతల్ రామానుజచార్య సహస్రాబ్ధి వేడుకలలో పాల్గొంటారు. అక్కడ రామానుజచార్యుల సుస్వర్ణ విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరిస్తారు.
అనంతరం 8 :30 లకు ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. కాగ ప్రధాని మోడీ హైదరాబాద్ కు వస్తున్న సందర్భంగా సీఎం కేసీఆర్ ఆహ్వనించనున్నారు. ప్రధాని మోడీ రాష్ట్రం లో ఉన్నంత వరకు సీఎం కేసీఆర్ ఆయనతోనే ఉండనున్నారు. అయితే ప్రధాని మోడీ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉండాలని మొదట నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వచ్చాయి.
అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పంపించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వచ్చాయి. కానీ సీఎం కేసీఆర్ మోడీ పర్యటనలో పాల్గొంటారని.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్వాగతం కూడా పలుకుతారని శుక్ర వారం సాయంత్రం సీఎంవో అధికారులు స్పష్టం చేశారు. అయితే గత కొద్ది రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అగ్ర నాయకులపై సీఎం కేసీఆర్ సంచలన విమర్శలు చేస్తున్నారు.