కొత్తగా పెళ్లి అయిన భార్య భర్తలు దాంపత్య జీవితం బాగుండాలంటే కచ్చితంగా వీటిని ఫాలో అవ్వాలి. ఈ మధ్యకాలంలో చిన్న చిన్న గొడవలు వచ్చి చాలా మంది ఏకంగా విడాకుల వరకు వెళుతున్నారు. అయితే దంపతులు ఖచ్చితంగా వీటిని ఫాలో అయితే ఎలాంటి సమస్యలు రావు. పైగా వాళ్ళ బంధం కూడా ఎంతో బాగుంటుంది. మరి అవేమిటో ఇప్పుడు చూద్దాం.
ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి:
భార్య భర్తల ఇద్దరికీ కూడా ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. ఇలా ఉంటే గొడవలు రావు. నమ్మకం ఉంటే ఇద్దరు మధ్య దూరం కూడా రాదు కాబట్టి కచ్చితంగా ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండేలా చూసుకోవాలి.
కోరికలకు విలువ ఇవ్వండి:
ఒకరి కోరికలకి ఒకరు గౌరవాన్ని ఇవ్వాలి. మీ బంధం దృఢంగా ఉండాలంటే ఇష్టాలకి విలువనివ్వడం ముఖ్యం. అలానే వాళ్ళకి నచ్చిన బహుమతులు ఇవ్వడం, ప్రేమగా మెలగడం ఇలాంటివి చేస్తే మీ బంధం బాగుంటుంది.
సమాన హక్కు ఉండాలి:
ఎప్పుడూ కూడా ఒకరినొకరు తక్కువ చేసి మాట్లాడకూడదు ఇద్దరు కూడా సమాన హక్కు తో ఉండాలి. ఇలా చేస్తే దంపతుల మధ్య అన్యోన్యత ఉంటుంది. అలానే బంధం కూడా ఎంతో బాగుంటుంది.
వృత్తిని గౌరవించండి:
ఒకరి కష్టాన్ని ఒకరు గుర్తించడం, ఒకరి వృత్తిని ఒకరు గౌరవించడం చాలా ముఖ్యం. ఎప్పుడూ కూడా ఎవరినీ తక్కువ చూపు చూడొద్దు. ఒకరు ఇబ్బందులలో ఉంటే వాళ్ల బాధను పంచుకోవాలి. అలానే కష్టం వచ్చిందంటే నేనున్నానని భరోసా ఇవ్వాలి. ఇలా భార్యాభర్తల మధ్య ఇవి ఉంటే కచ్చితంగా వాళ్ళ బంధం బాగుంటుంది.