Rowdy Boys : ‘రౌడీ బాయ్స్’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

-

టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ జంటగా ఇటీవల తెరకెక్కిన తాజా సినిమా రౌడీ బాయ్స్. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా దర్శకుడు శ్రీహర్ష తెరకెక్కించారు. ఇక ఈ సినిమాను టాలీవుడ్ బిగ్గెస్ట్ నిర్మాత దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత స్వరాలు అందించారు.

హీరో అశిష్ దిల్ రాజు కుటుంబానికి దగ్గరి బంధువు. అందుకే ఈ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన పాటలు, పోస్టర్లు అందరినీ అలరించగా.. రౌడీ బాయ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల అయింది.

అయితే.. విడుదల తర్వాత సినిమా స్టోరీ రొటిన్‌ గా ఉండటంతో.. పెద్దగా ఆదరణ రాలేదు. అయితే.. ఈ సినిమాలో రొమాంటిక్‌ యాంగిల్‌ బాగా వర్కౌట్‌ అయింది. కాగా..తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయింది. మార్చి 11 వ తేదీన జీ 5 ప్రీమియంలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ మేరకు పోస్టర్‌ విడుదల అయింది.

Read more RELATED
Recommended to you

Latest news