చట్ట సభల్లోనే బూతులు మాట్లాడటమేంటి ? వైసీపీని పరోక్షంగా విమర్శించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఇవాళ గుంటూరులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజల మధ్య విభేదాలు సృష్టించి విడగొడుతున్నారని.. నాయకులే ప్రజల మధ్య చీలికలు తీసుకురావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
చట్ట సభల్లోనే బూతులు, అసభ్య పదజాలం వాడటం దారుణమని చంద్రబాబు సంఘటనను గుర్తు చేసుకున్నారు. కులం, మతం, నేర ప్రవృత్తి, డబ్బు ప్రదానమైపోవటం దారుణమని ఆగ్రహించారు. పాటిబండ్ల సీతారామయ్య పాఠశాల ఎందరో సమర్థులను దేశానికి అందించిందని.. ఎంతో ముందుచూపుతో అప్పట్లో సీతారామయ్య ఈ పాఠశాలను ఏర్పాటు చేశారని తెలిపారు.
వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దని విద్య నిరుపయోగమని మహాత్మా గాంధీ అన్నారని.. సమాజంలో రోజురోజుకూ విలువలు తగ్గుతున్నాయని చెప్పారు. ఉపరాష్ట్రపతి అయ్యాక కూడా నా వేషధారణ మార్చలేదని… మన సంప్రదాయ వస్త్రధారణతో ఏ దేశానికి వెళ్లినా అందరూ గౌరవిస్తున్నారని వెల్లడించారు. మన సంప్రదాయాలను మనం పాటిస్తే ప్రపంచం మనం గౌరవిస్తుందని..మన భాషను, మాతృభాషను గౌరవించుకోవాలని కోరారు.