RRR movie : .ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్ వాయిదా.. రామ్ చరణ్‌కు గాయం

-

రాజమౌళి, రామ్‌ చరణ్‌, రామారావు (జూనియర్‌ ఎన్టీఆర్‌)ల కాంబోగా తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదా పడ్డట్లు తెలుస్తుంది. ఈరోజు రాం చరణ్ జిమ్ ప్రాక్టీస్ చేస్తుండగా యాంకిల్ కు గాయమైనట్టు తెలుస్తుంది. రాజమౌళి డైరక్షన్ లో భారీ మల్టీస్టారర్ గా వస్తున్న ఈ మెగా మల్టీస్టారర్‌ ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం వడోదరాలో జరుపుకుంటుంది. అక్కడ లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేయగా ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు అక్కడ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది.

ఈ వాయిదా కారణంగా ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల లేటవుతుందేమో… అయితే రాజమౌళి అన్నింటికీ సిద్ధంగా ఉండే రిలీజ్‌ డేట్‌ ప్లాన్‌ చేస్తారట. అనుకోకుండా జరిగే సంఘటనలు, అవాంతరాలు రావడం అన్నీ లెక్కేసుకొనే రిలీజ్ డేట్‌ ఫిక్స్‌ చేస్తారట రాజమౌళి. దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి.. బాహుబలి తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.


అయితే రాం చరణ్ గాయానికి సంబందించిన ఎలాంటీ ఫోటోలు బయటకు రానివ్వలేదు. మెగా ఫ్యాన్స్ మాత్రం చరణ్ కు గాయమన్న వార్తలతో కంగారు పడుతున్నారు. చిన గాయమే అయినా చరణ్ ప్రస్తుతం ఎలా ఉన్నాడన్న ఆత్రుత వారిలో ఉంది. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.

ఈ మెగా నందమూరి కాంబో వీలైనంత తొందరగా థియేటర్లలోకి వస్తే అప్పుడు ఉంటుంది అసలు మజా… రికార్డుల బద్దలవడం.. పక్కా..

Read more RELATED
Recommended to you

Latest news