హైదరాబాద్ నుంచి ఇస్లామాబాద్ వరకు ఎంఐఎం టెర్రర్ కారిడార్ ఏర్పాటు చేస్తోంది.: మురళీధర్ రావు

-

బోధన్ ఘటనపై బీజేపీ నేత మురళీధర్ రావు తీవ్రంగా ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్న నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటు విషయమై రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు పట్టణం మొత్తం 144 సెక్షన్ విధించారు. పోలీసుల తీరుకు నిరసనగా బీజేపీ, భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ బోధన్ బంద్ కు పిలుపునిచ్చారు. 

ఇదిలా ఉండే బీజేపీ నేత మురళీధర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భారతదేశంలో ఉందా…? పాకిస్థాన్ లో ఉందా…? అంటూ ప్రశ్నించారు. ఛత్రపతి శివాజీకి జై అంటే నేరమా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచి ఇస్లామాబాద్ వరకు ఎంఐఎం టెర్రర్ కారిడార్ ఏర్పాటు చేస్తోందని మురళీధర్ రావు విమర్శించారు. ఎంఐఎంకు ప్రభుత్వం, పోలీసులు సహకరిస్తున్నారంటూ.. ఆరోపించారు. హిందువుల గురించి మాట్లాడితే మతపిచ్చి అంటూ ముద్రవేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతారిహితంగా మాట్లాడితే ఖబద్దార్ కేసీఆర్ అంటూ హెచ్చరించారు. మతోన్మాదానికి, ఉగ్రవాదానికి కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఓవైసీ, కేసీఆర్ రాజకీయాలు నడవవంటూ హెచ్చరించారు మురళీ ధర్ రావు.

కాశ్మీర్ ఫైల్స్ గురించి తెలుసుకున్నామని.. హైదరాబాద్ ఫైల్స్ గురించి మాట్లాడాలని మురళీ ధర్ రావు అన్నారు. హిందువుల పలాయనం హైదరాబాద్ లో కూడా కొనసాగిందని అన్నారు. అందకే పాతబస్తీ నుంచి హిందువులు తరలిపోయారని అన్నారు. యాకుత్ పుర, చంద్రాయనగుట్ట, చార్మినార్ లో ఉాండాల్సిన హిందువులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news