జగ్గారెడ్డికి టీపీపీసీ షాక్…. వర్కింగ్ ప్రెసిడెంట్ గా తొలిగింపు

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డికి టీపీపీసీ షాక్ ఇచ్చింది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చిన అదనపు బాధ్యతల్లో కోత పెట్టింది. పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలు, అనుబంధ సంఘాల బాధ్యతలను నుంచి తప్పించింది టీపీపీసీ. ఆయన ఉన్న బాధ్యతలను మిగతా వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పగిస్తూ టీపీపీసీ నిర్ణయం తీసుకుంది. 

ఇటీవల కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. నిన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్లు  అధిష్టానం హెచ్చిరికలను కూడా లేక్క చేయకుండా మర్రి శశిధర్ రెడ్డి అధ్యక్షతన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వీహెచ్, జగ్గారెడ్డి భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశం అనంతరం జగ్గారెడ్డి… టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డికి భజన చేసేవాళ్లు ఎక్కువ అయ్యారంటూ విమర్శించారు. నువ్వు హీరోవి, తీస్మార్ ఖాన్ వి అయితే … నేను రాజీనామా చేస్తా.. నాపై కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ పెట్టి గెలిపించాలని సవాల్ చేశారు. ఈ వ్యాఖ్యల ఫలితంగానే జగ్గారెడ్డికి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news