కేంద్ర ప్రభుత్వ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల ఎకరాల్లో పంట పండుతుందని… ఆ మొత్తం పంటను కేంద్ర ప్రభుత్వమే కొనాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంపై రేపు తెలంగాణ రాష్ట్ర మంత్రులు అలాగే పార్లమెంటు సభ్యులు ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని కలుస్తారని ఆయన వివరించారు.
తెలంగాణ నుంచి వచ్చే ధాన్యాన్ని పూర్తిగా కొనాలని వారు కేంద్రానికి వినతిపత్రం ఇస్తామని సీఎం కేసీఆర్ వివరించారు. ధాన్యం కొనుగోలు బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకో కూడదు అని హెచ్చరించారు. బాయిల్డ్ రైస్ తీసుకుంటారా లేదా రా రైస్ తీసుకుంటారా అనేది కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని అన్నారు. మా దగ్గరి ధాన్యం తీసుకోండి… ఏ రైసు చేసుకుంటారో అది మీ ఇష్టం అంటూ చురకలంటించారు సీఎం కేసీఆర్.
రేపు ఢిల్లీలో దీనిపై తెలంగాణ మంత్రులు మరియు ఎంపీలు ఆహారం అందరికి విజ్ఞప్తి చేస్తానని ఆయన తెలిపారు. ఇది రైతుల జీవన్మరణ సమస్య అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం స్థాయిలో కేంద్రo పై పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. దీనిపై కేంద్రం వినకపోతే యాక్షన్ ఓరియంటెడ్ తమ పోరాటం ఉంటుందని హెచ్చరించారు సీఎం కేసీఆర్.