ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే… రాజకీయాల నుంచి తప్పుకుంటా: అరవింద్ కేజ్రీవాల్

-

ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీకి సవాల్ విసిరారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు( ఎంసీడీ) ఎన్నికలను సకాలంలో నిర్వహించి బీజేపీ గెలిస్తే తాము రాజకీయాల నుంచి తప్పుకంటామని కేజ్రీవాల్ సవాల్ విసిరారు. దేశంలో అతిపెద్ద పార్టీగా చెప్పుకుంటున్న బీజేపీ… ఢిల్లీలోని చిన్న పార్టీ ఆప్ ను చూసి భయపడుతోందని ఆయన అన్నారు. ఢిల్లీలో మున్సిప్ కార్పొరేషన్ ఎన్నికలను బీజేపీ వాయిదా వేయడం అంటే… భారతదేశంలో బ్రిటిష్ వారిని తరిమికొట్టి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పిన అమరవీరుల త్యాగాలను అవమానపరచడమే అంటూ కేజ్రీవాల్  ట్విట్ చేశారు. ఓటమి భయంతో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలును వాయిదా వేసిన వారు రేపు రాష్ట్రాలు, దేశ ఎన్నికలను కూడా వాయిదా వేస్తారని కేజ్రీవాల్ విమర్శించారు. ఓడిపోతామనే భయంతో బీజేపీ ఎన్నికలను వాయిదా వేస్తోందని.. అది ప్రజల గొంతులను నొక్కేయడమే అని కేజ్రీవాల్ అన్నారు. ఎన్నికలను సకాలంలో నిర్వహించకుండా ఎన్నికల సంఘంపై బీజేపీ ఒత్తడి పెడుతుందని… ఎన్నికలను సకాలంలో నిర్వహించాలని డిమాండ్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news