ఆ టీవీ సీరియల్‌లో సత్తా చాటిన తారక్.. ఆయన పోషించిన పాత్ర ఇదే..

-

నందమూరి నటవారసుడిగా తెలుగు చిత్ర సీమకు వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ నటనా ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన తాత సీనియర్ ఎన్టీఆర్ పేరును మాత్రమే కాదు ఆయనలోని గుణాలను కూడా పుణికిపుచ్చుకున్న చక్కటి నటుడిగా పేరు సంపాదించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్.

తారక్, రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డుల వేటలో తలమునకలైంది. ఈ పిక్చర్ చూసి సినీ, రాజకీయ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హీరోల నటనతో పాటు రాజమౌళి దర్శకత్వ ప్రతిభను మెచ్చుకుంటూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్తున్నారు.

కొమురం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ తప్ప ఇంకెవరూ నటించలేరు అని ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం చూసిన ప్రతీ ఒక్కరు అనుకునేలా ఆయన నటించారు. కాగా, జూనియర్ ఎన్టీఆర్ ఓ టీవీ సీరియల్ లోనూ కీలక పాత్ర పోషించారు. ఈ సంగతి చాలా మందికి తెలసి ఉండబోదు. ఆ సీరియల్ లో సీనియర్ ఎన్టీఆర్ లీడ్ రోల్ ప్లే చేయడం విశేషం. ఈ సీరియల్ పేరు ‘భక్త మార్కండేయ’. కాగా, అందులో జూనియర్ ఎన్టీఆర్ ఓ పాత్ర పోషించగా, తన నటనకు సీనియర్ ఎన్టీఆర్ దగ్గరి నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు.

తారక్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయిపోగా, తన నెక్స్ట్ ఫిల్మ్స్ అన్ని కూడా పాన్ ఇండియా అవుతుండటం విశేషం. ‘ఆచార్య’ ఫిల్మ్ ప్రమోషన్స్ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్టర్ కొరటాల శివతో జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేయనున్నారు. వీరి కాంబోలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ బాక్సాఫీసు వద్ద సత్తా చాటింది. కొరటాల శివ తర్వాత తారక్ ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం చేయనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news