చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండియాలో కరోనా మహమ్మారి విజృంభణ క్రమ క్రమంగా తగ్గుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,033 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,31,958 కు చేరింది.గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,222 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యాప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,24,87,89 కు చేరింది.
ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1852072469 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 15,37,314 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 11,639 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 43 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,21,530 కి చేరింది.
India reports 1,033 fresh #COVID19 cases, 1,222 recoveries, and 43 deaths in the last 24 hours.
Active cases: 11639 0.03% pic.twitter.com/XTWYiWM1DQ
— ANI (@ANI) April 7, 2022