టీడీపీ పార్టీపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాక్యలు చేశారు. అసూయతో మందు లేదని ప్రధాని నరేంద్ర మోడీని కలిస్తే నాకు క్లాస్ పీకారని ప్రచారం చేశారు అని సీఎం జగన్ మండిపడ్డారు. నేను, ప్రధాని నరేంద్ర మోడీ గారు మాత్రమే రూమ్ లో ఉన్నాం … వాళ్లు ఏమైనా మా సోఫా కింద ఉన్నారా? నాపై అసూయతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసూయ కు మందు లేదని.. ఇంత అసూయతో ఉంటే త్వరగా గుండెపోటు, బీపీ లు వస్తాయని చురకలంటించారు. అలాంటి వారు త్వరగా టికెట్ తీసుకుంటారని వాళ్ళ మాటలు అస్సలు నమ్మకూడదు అని ప్రజలను కోరారు.
చంద్రబాబు, పవన్ కళ్యాన్ ఓ దొంగల ముఠా అని… హైదరాబాద్ లో మకాం వేసి ప్రభుత్వాన్ని బదానాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అంటూ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వలంటీర్లు అంటే గొప్ప సైనికులు, గొప్ప సేవకులు. ఈ సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం తరపున చిరుసత్కారం అందజేస్తున్నామని పేర్కొన్నారు వైఎస్ జగన్. ఏ పథకమైనా వివక్షకు తావు లేకుండా వలంటీర్లు సేవలు అందిస్తున్నారన్నారు వైఎస్ జగన్. రాష్ట్రంలో 2 లక్షల 60 వేలమంది వలంటీర్లు.. లక్షల మందికి పైగా లబ్ధిదారులకు సేవలు అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.