కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇటీవల ‘వలిమై’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. యంగ్ డైరెక్టర్ హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో అయితే స్పందన రాలేదు. కానీ, అజిత్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరోను యాక్షన్ ఎంటర్ టైనర్ లో చూసి ఫుల్ ఫిదా అయిపోయారు. కాగా, అజిత్-వినోద్ కాంబోలో మరో చిత్రం అనగా హ్యాట్రిక్ ఫిల్మ్ రాబోతున్నది.
AK 61గా రాబోతున్న ఈ పిక్చర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్ లో స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో #AK 61 హ్యాష్ ట్యాగ్ ను అజిత్ కుమార్ అభిమానులు వైరల్ చేస్తున్నారు. హెచ్.వినోద్ దర్శకత్వంలో వస్తున్న ఈ పిక్చర్ స్టోరి వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నదని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్ రాబరీ నేపథ్యంలో స్టోరి ఉండబోతున్నదని టాక్.
హైదరాబాద్ లో రెండు నెలల పాటు చిత్ర షూటింగ్ ఉండబోతుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రం కోసం భారీ బ్యాంక్ సెట్ ను నిర్మించనున్నారు మేకర్స్. బోనీకపూర్ ప్రొడ్యూసర్. కాగా, జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా, సుప్రీమ్ సుందర్ యాక్షన్ కొరియోగ్రఫీని అందించనున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్ గా విశ్వసుందరి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ ను తీసుకుంటున్నారని వార్తలొస్తున్నాయి. అయితే, మేకర్స్ హీరోయిన్ విషయమై ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే చేయలేదు. తెల్ల గుబురు గడ్డంతో ఉన్న అజిత్ కుమార్ లుక్ ను చూసి అజిత్ కుమార్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. స్టైలిష్ లుక్ లో ఈ సారి అజిత్ అదరగొడతారని అనుకుంటున్నారు సినీ అభిమానులు.
April 11 th #AK61Pooja start's 🔥2months shoot in Hyderabad after chennai mount road for bank sets ☀️@BoneyKapoor @Arunbarathioffl @GhibranOfficial @Kavin_m_0431 #HVinoth #Ajithkumar𓃵 ❤️ pic.twitter.com/DZ5QECzLvg
— Kiran. A (@Kiranstanlyoffl) April 11, 2022