ఐకూలో..మిడ్ రేంజ్ లో గేమింగ్ స్మార్ట్ ఫోన్ భారత్ లో విడుదల కానుంది. iQoo Z6 Pro 5G స్మార్ట్ ఫోన్.. స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో గేమింగ్ ఫీచర్స్ తో ఈతరం వారిని బాగా ఆకట్టుకునే విధంగా ఉంది. ఈరోజు మనం ఈ ఫోన్ ఫీచర్స్, ధర చూద్దాం..
iQoo Z6 Pro 5G స్పెసిఫికేషన్లు అంచనా
120Hz రిఫ్రెష్ రేట్ ఉండే డిస్‌ప్లేతో iQoo Z6 Pro 5G రానుంది. అయితే అమోలెడ్, ఎల్‌సీడీల్లో ఏ ప్యానెల్ ఉంటుందని స్పష్టత లేదు.
iQoo అమోలెడ్ వైపే మొగ్గుచూపుతుందని అంచనాలు వెలువడుతున్నాయి.
మరోవైపు స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై iQoo Z6 Pro 5G రన్ అవుతుందని సమాచారం.
ఇక Android 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో iQoo Z6 Pro 5G రావడం దాదాపు ఖరారైంది.
5000ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉందని అంచనా. ఈ మొబైల్ వెనుక నాలుగు కెమెరాల సెటప్ ఉండే ఛాన్స్ ఉంది. మిగిలిన స్పెసిఫికేషన్ల గురించి సమాచారం ఇంకా వెల్లడికాలేదు.
iQoo Z6 Pro 5G మొబైల్ 5,50,000 పాయింట్లు స్కోర్ చేసినట్టు సమాచారం. ఈ రేంజ్‌లో ఇదే అధికం.
iQoo Z6 5G 5జీ మొబైల్ భారత్‌లో ఇటీవలే విడుదల కాగా.. ఇప్పుడు దానికి అప్‌గ్రేడెడ్ మోడల్‌గా Z6 ప్రో 5జీ రానుంది.
iQoo Z6 Pro 5G ధర
ఐకూ జెడ్ 6 ప్రో 5జీ ధర భారత్‌లో రూ.25,000 రేంజ్‌లో ఉంటుందనేది అంచనా.
ఐకూ జీ6 5జీ ప్రారంభ ధర రూ.15,499గా ఉండగా.. దీనికంటే ఈ ప్రో మోడల్ ధర ఎక్కువగానే ఉండనుంది.
ఈ సెగ్మెంట్‌లో రియల్‌మీ, షియోమీ, వన్‌ప్లస్ నార్డ్ ఫోన్‌లకు పోటీగా నిలిచే అవకాశం ఉంది. అధికారింగా తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఈ రేంజ్ స్పెసిఫికేషన్స్ తో.. ఫోన్.. మిమ్మల్ని ఆకట్టుకుంటుందనంటలో ఎలాంటి సందేహం లేదు.