సోనియా గాంధీనే జగన్ ఎదిరించాడు – మాజీ మంత్రి బాలినేని

-

సోనియా గాంధీనే జగన్ ఎదిరించాడని.. ఒకరికి లొంగే వ్యక్తి కాదన్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. సీఎం జగన్ ఆలోచనా పరుడు.. ఎవరిని ఎలా వాడుకోవాలో ఆయనకి తెలుసు అన్నారు. ఎవరో బెదిరిస్తే మంత్రి పదవి ఇచ్చే వ్యక్తి జగన్ కాదని వెల్లడించారు. మంత్రి పదవి రేసులో ఉన్న సమయంలో 1700 కోట్లు అవినీతి చేశానని టీడీపీ నాయకులు ఆరోపించారని ఫైర్ అయ్యారు.

నాపై చేసిన ఆరోపణలకు చర్చకి సిద్దమని సవాల్ విసిరారు. పాత కొత్త కలయికతో సీఎం జగన్ మంత్రి వర్గం ఏర్పాటు చేశారన్నారు. మంత్రి పదవి రాక బాధపడిన వాళ్లంతా సర్థుకున్నారని వివరించారు.
కొత్త మంత్రులు రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నారని స్పష్టం చేశారు. ఎవరైనా పార్టీ పెట్టినప్పుడు ఒక జెండా, ఒక అజెండా, ఒక సిద్ధాంతం ఉంటాయని వెల్లడించారు. ఎవరికో పల్లకి మోయడం పవన్ సిద్ధాంతమని అగ్రహించారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి పాలన లో ఏపీ ప్రజలు సంతోశంగా ఉన్నారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news