సిఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. తెలంగాణ తెచ్చింది మేమే అని గప్పాలు కొడుతున్న కేసీఆర్.. ఉద్యమ ఆశయాలను గౌరవించారా? అని నిలదీశారు. అమరుల కుటుంబాలను పరామర్శించారా? ఉద్యమకారులను ఆదుకున్నారా? మీ పక్కన ఉద్యమ ద్రోహులు ఉన్నారా? ఉద్యమకారులున్నారా? ఉద్యమంలో దొంగ దీక్షలు చేసింది మీరేనని అగ్రహించారు.
పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టె మర్చిపోయింది మీరని… సెంటిమెంటును రెచ్చగొట్టి వేలాది మంది ప్రాణాలు పోడానికి కారణమైంది మీరని ఫైర్ అయ్యారు. తెలంగాణ బంగారు తునక అని చెప్పి, ప్రతి కుటుంబం మీద 4లక్షల అప్పు మోపారని అగ్రహించారు. రేట్లు పెంచి ప్రజల రక్తం పిండితున్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు.. దోపిడీ రాజ్యం అని వైఎస్ షర్మిల అన్నారు. మేం పార్టీ పెట్టడానికి కారణం KTR అయ్య KCR. కేసీఆర్ దిక్కుమాలిన పాలన వల్లే మేం పార్టీ పెట్టామన్నారు.