బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) భారీ చర్యలు తీసుకుంది.సుకేష్ చంద్ర శేఖర్ కేసులో జాక్వెలిన్ రూ.7 కోట్ల 12 లక్షల విలువైన చర, స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసినట్టు సమాచారం.తీహార్ జైలులో 200 కోట్ల రూపాయల దోపిడీ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సుకేష్ చంద్ర శేఖర్ తో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.బహ్రయిన్ లో ఉంటున్న జాక్వలిన్ తల్లిదండ్రులకు, అమెరికాలో ఉంటున్న ఆమె సోదరికి సుకేష్ ఖరీదైన కార్లను ఇచ్చినట్లు విచారణలో తేలిందని ఈడీ వర్గాలు తెలిపాయి.ఇది కాకుండా అతని సోదరుడికి 15 లక్షల రూపాయల నగదు కూడా ఇచ్చారు.విచారణలో జాక్వెలిన్ వాంగ్మూలాన్ని ఈడీ రికార్డు చేసింది.
అదే సమయంలో..సుఖేష్ తన కుటుంబ సభ్యులకు తనకు లక్షల రూపాయల విలువైన గుర్రంతో సహా ఖరీదైన బహుమతులు ఇచ్చాడని జాక్వెలిన్ ఈడికిి తెలిపింది.ఇది కాకుండా జాక్వలిన్ విలాసవంతమైన హోటల్లో జీవన వ్యయాన్ని కూడా సుకేష్ భరించాడు.జాక్వలిన్ సుఖేష్ ల చాలా చిత్రాలు కూడా రివీల్ చేశారు.ప్రస్తుతం సుఖేష్ తీహర్ జైల్లో ఉన్నాడు.జాక్వెలిన్ కు సుఖేష్ ఇచ్చిన సుమారు రూ. 7 కోట్ల ఆస్తి నేరగాళ్ల సొత్తు అని ఈడీ విచారణలో తేలింది.దీంతో చర్యలు తీసుకున్న ఏజెన్సీ జాక్విలిన్ ఆస్తులను జప్తు చేసింది.