తప్పుడు హామీలు ఇచ్చి గెలిచాడు… ఎంపీ అరవింద్ పై కవిత ఫైర్

-

నిజామాబాద్ ఎంపీగా తప్పుడు హామీలు ఇచ్చి అరవింద్ గెలిచాడని ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయింది. ఎన్నికల్లో గెలిచిన మూడేళ్లలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని కవిత విమర్శించారు. గతంలో పసుపు రైతుల కోసం పోరాడింది టీఆర్ఎస్ పార్టీయే అని కవిత అన్నారు. పసుపు బోర్డ్ ఏర్పాటు కోసం పలుమార్లు ఢిల్లీ నాయకులను కలిశామని అన్నారు. రాందేవ్ బాబాను నిజామాబాద్ తీసుకువచ్చి ప్లాంట్ పెట్టాలని కోరామని కవిత అన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి ప్రజలను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పేరుకే సంగ్రామ యాత్రలు చేస్తోందని బీజేపీని విమర్శించింది. ఎప్పటికైనా తెలంగాణ రైతులను ఆదుకునేది బీజేపీ పార్టీనే అని కవిత అన్నాడు. మూడేళ్లలో అరవింద్ నిజామాబాద్ రైతులకు తీసుకువచ్చింది కేవలం రెండు కోట్ల రూపాయలే అని… ఒక్కో పసుపు రైతుకు కేవలం రూ. 250 మాత్రమే తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ గ్యాస్, పెట్రల్ ధరలను మాత్రం పెంచుతుందని విమర్శించింది.

Read more RELATED
Recommended to you

Latest news