బీజేపీకి సైకిల్ దెబ్బ.. ఆ బ్యాచ్ రివర్స్?

-

ఏపీలో బీజేపీకి టీడీపీ రివర్స్ షాకులు ఇచ్చేలా ఉంది.. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది బీజేపీ నుంచి టీడీపీలోకి వలసలు పెరిగేలా ఉన్నాయి..బీజేపీలో ఉంటే గెలవడం కష్టమనే విషయం అందరికీ అర్ధమైతుంది..ఎందుకంటే ఏపీలో బీజేపీకి ఒక్క శాతం ఓట్ల బలం లేదు…ఆ పార్టీకి ఒక్క సీటు కూడా గెలుచుకునే శక్తి లేదు…కాకపోతే కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల..తమకు తిరుగులేదనే ఏపీ బీజేపీ నేతలు అనుకుంటున్నారు. పైగా గత ఎన్నికల్లో ఏపీలో ఓడిపోయాక టీడీపీ నేతలు సేఫ్ సైడ్ గా బీజేపీలోకి వచ్చారు. బీజేపీలోకి వస్తే వైసీపీ ద్వారా ఇబ్బందులు ఉండవని అనుకుని, టీడీపీని వదిలి…కమలం పార్టీలో చేరారు.

TDP BJP party

అలా అని వచ్చే ఎన్నికల వరకు కమలం పార్టీలోనే కొనసాగితే..ఆ నేతలకు ఎలాంటి భవిష్యత్ ఉండదు…ఎందుకంటే ఆ పార్టీకి సింగిల్ గా ఒక్క సీటు కూడా గెలిచే సత్తా లేదు…అలాగే జనసేనతో కలిసి ఉన్నా సరే గెలుస్తుందనే నమ్మకంలేదు…అంటే బీజేపీలో ఉండటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు…ఒకవేళ టీడీపీతో గాని పొత్తు ఉంటే…ఏదో నాలుగైదు సీట్లు గెలుచుకోవచ్చు….కానీ మిగిలిన నేతల పరిస్తితి ఇబ్బందికరం గానే ఉంటుంది..అదే టీడీపీలోకి వెళితే సీటు దక్కే అవకాశమైన ఉంటుందని కొందరు నేతలకు అర్ధమైంది.

అందుకే కొందరు నేతలు ఇప్పుడు టీడీపీలోకి వచ్చేందుకు చూస్తున్నారు…ఇప్పటికే రావెల కిషోర్ బాబు…బీజేపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారు…ఆయన బాటలోనే మరికొందరు బీజేపీ నేతలు టీడీపీలో చేరడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది…అది కూడా గత ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన నేతలే..మళ్ళీ రివర్స్ లో టీడీపీలోకి రానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news