ఉత్కంఠ పోరులో కేకేఆర్ పై లక్నో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఆఖరి ఓవర్ వరకూ సాగిన మ్యాచ్ లో కేకేఆర్ పై లక్నో రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 14 మ్యాచుల్లో తొమ్మిది విజయాలతో లక్నో ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో వికెట్లు నష్టపోకుండా 210 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో కోల్ కతా 8 వికెట్ల నష్టానికి 208 పరుగుల చేసింది.
శ్రేయస్ అయ్యర్ 50 పరుగులు, రింకు సింగ్ 40 పరుగులు, నితీశ్ రాణా 42 పరుగులు, సామ్ బిల్లింగ్స్ 36 పరుగులు, సునిల్ నరైన్ 21 పరుగులతో ధాటి గా ఆడినా విజయం సాధించలేకపోయింది. లక్నో బౌలర్లలో మోహ్‌సిన్ ఖాన్ 3 వికెట్లు, మార్కస్ స్టొయినిస్ 3 వికెట్లు, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీశారు. ఈ ఓటమితో కోల్ కతా ఇంటి ముఖం పట్టింది. అయితే… కేకేఆర్ పై లక్నో రెండు పరుగుల తేడాతో విజయం సాధించడం హైదరాబాద్ కు కలిసొచ్చే విషయం. హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కు చేరేందుకు మార్గం సుగమం కానుంది.