మద్యం ప్రియులకు షాక్‌.. తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు..

-

మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన మద్యం ధరలు ఈ నెల 19 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మద్యం దుకాణాల్లో ఇవాళ్టి అమ్మకాలు పూర్తి కాగానే అబ్కారీ అధికారులు మద్యం సీజ్‌ చేయనున్నారు. నిల్వలు లెక్కించి రేపటి నుంచి.. పెరిగిన ధరల ప్రకారం విక్రయించేలా చర్యలు తీసుకోనున్నట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది.

తెలంగాణ‌లో మ‌ద్యం ధ‌ర‌లు పెరిగాయి. ఒక్కో బీరుపై రూ.20 పెంచిన ప్రభుత్వం…బ్రాండ్‌తో సంబంధం లేకుండా ఒక్కో క్వార్ట‌ర్‌పై రూ.20 పెంచింది. ఇక బ్రాండ్‌తో నిమిత్తం లేకుండా ప్ర‌తి హాప్ బాటిల్ పై రూ.40, ఫుల్ బాటిల్ మ‌ద్యం ధ‌ర‌ను ఏకంగా రూ.80 పెంచింది. ఈ మేర‌కు బుధ‌వారం రాత్రి తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

పెంచిన ధ‌ర‌లు రేప‌టి ( మే 19) నుంచే అమ‌ల్లోకి రానున్నాయి. మ‌ద్యం ధ‌ర‌ల‌ను పెంచిన నేప‌థ్యంలో నేటి రాత్రి మ‌ద్యం విక్ర‌యాల గ‌డువు ముగియ‌గానే… ఆయా దుకాణాల్లోని మ‌ద్యంను అధికారులు సీజ్ చేయ‌నున్నారు. ఆపై గురువారం నుంచి పెరిగిన మ‌ద్యం రేట్ల‌ను అమ‌లులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news