లాబీయింగ్ అన్నది తప్పేం కాదు పదవి నుంచి వెళ్లిపోతూ కూడా కొందరు లాబీయింగ్ చేస్తారు కూడా ! పొలిటికల్ లాబీయిస్టులలో సీమకు చెందిన టీజీ వెంకటేశ్ పేరు కానీ లేదా సుజనా చౌదరి పేరు కానీ లేదా ఇప్పటి ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు పేరు కానీ బలీయంగానే వినిపించేంది. వైఎస్సార్ హయాంలో పొలిటికల్ లాబీయిస్టుగా కేవీపీ ఉండేవారు. ఇది కాదనలేని సత్యం. చంద్రబాబు హయాంలో కూడా నారాయణలాంటి పొలిటికల్ లాబీయిస్టులు ఉండేవారు. తరువాత వీళ్లంతా సైడ్ అయిపోయి అటు చంద్రబాబును ఇటు లోకేశ్ ను ఒంటరి చేసి పోయారు.
ఇక అన్నయ్య కోసం చెల్లెమ్మ కొంత త్యాగం చేశారు. ఇది వాస్తవం. ఇదంతా వైసీపీకి సంబంధించిన ఫ్యాష్ బ్యాక్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో అమ్మాయి అయినా కూడా చాలా దూరం నడిచి, పాదయాత్ర పేరుతో ఊరూరా తిరిగి, నాన్నను మించి ఎక్కువ దూరం నడిచి అప్పట్లోనే మంచి పేరు తెచ్చుకున్నారు షర్మిల. ఆమెకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ రోజు పనిచేశారు. ఇప్పుడు ఆమెను అన్నయ్య దూరం పెట్టారు అన్న వార్తలు వస్తున్నాయి. అందుకు ఆస్తి తగాదాలు కూడా ఓ కారణం అన్న వార్తలూ వచ్చేయి. సరే ! అవి వాళ్ల అంతర్గత విషయాలు.. అని విని వదిలేసిన వారూ ఉన్నారు. ఇక తాజాగా ఆర్.కృష్ణయ్య నియామకం అన్నది కూడా వైసీఆర్టీపీ కోసమే అన్నది ఓ టాక్. అది నిజమో కాదో అన్నది కాలమే తేల్చాలి. ఏదేమయినప్పటికీ పక్క ప్రాంతం లేదా పొరుగు
తెలుగు రాష్ట్రం లో షర్మిలక్క పాగా వేయడం కోసం జగనన్న చేసిన రిస్క్ ఇది అని పసుపు దండు వ్యాఖ్యలు చేస్తోంది.