హైదరాబాద్ మెట్రో ట్రైన్‌లో సాంకేతిక లోపం..!!

-

హైదరాబాద్ మెట్రో ట్రైన్‌లో సాంకేతిక లోపం కారణంగా రైలు నిలిచిపోయింది. ఎల్‌బీనగర్ నుంచి మియాపూర్ వెళ్తున్న రైలులో మూసారాంబాగ్ స్టేషన్ వద్ద సాంకేతిక లోపంతో కాసేపు నిలిచిపోయింది. రైలు నిలిచిపోవడంతో మెట్రో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు పలు మెట్రో స్టేషన్‌లో వేచి ఉన్నారు. ఆ తర్వాత సమస్య క్లియర్ అవ్వడంతో యధావిధిగా మెట్రో సేవలు కొనసాగాయి. అయితే కరెక్ట్ ఆఫీస్ టైంలోనే మెట్రో రైళ్లు ఆగిపోవడంతో.. ప్రయాణికులు ఎంతో ఇబ్బంది పడ్డారు. రైళ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.

హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రో

కాగా, సాంకేతిక సమస్యల కారణంగా మెట్రో రైలు కాసేపు నిలిచిపోయిందని అధికారులు వెల్లడించారు. అయితే సమస్యను వెంటనే పరిష్కరించామని, గతేడాది కూడా పలుసార్లు సాంకేతిక సమస్యలు తలెత్తాయన్నారు. మెట్రో రైళ్లలో సాంకేతిక సమస్యలు రావడంతో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ పెరగడంతో.. వాతావరణంలో దుమ్ము, దూళి, కాలుష్యం పెరిగిందన్నారు. వీటి వల్ల మెట్రో రైళ్లు వెళ్లే మార్గంలో రెడ్‌లైట్లు వెలుగుతున్నాయి. దీంతో మెట్రో రైళ్లు ఆకస్మాత్తుగా నిలిచిపోతున్నాయని మెట్రో అధికారులు తెలిపారు. భవిష్యత్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news