మంచివాడు ఎన్టీఆర్.. ఆయన స్ఫూర్తితో నాయకులు ఎదిగివచ్చారు. మహా శక్తిగా ఉన్న కాంగ్రెస్ ను ఢీ కొని గొప్ప నాయకులుగా ఎదిగిన వైనంలో ఎన్టీఆర్ ఉన్నారు ఆ వేళ. అప్పుడూ ఇప్పుడూ గొప్పవాడు ఎన్టీఆర్. ఆ మాటలో కించిత్ అనుమానం లేదు. ఆయన బాటలో తెలుగుదేశం పార్టీ నడుస్తోంది. ఎదిగివస్తోంది. కొన్ని ఓటములున్నా కూడా మంచి దిశగా ప్రయాణించేందుకు ప్రయత్నిస్తుంది.
పార్టీకి జవం జీవం ఇచ్చే విధంగా కొన్ని మార్పులు తీసుకు రావాలని బాబు యోచిస్తున్నారు. ఆ విధంగా లోకేశ్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని యోచిస్తున్నారు అని సమాచారం.ఇప్పుడిప్పుడే నాయకుడిగా యాక్టివ్ అవుతున్న లోకేశ్ ముందున్న కాలంలో ఇంకా బాగా పనిచేయాల్సి ఉంది. ఆ విధంగా ఆయన తనను తాను దిద్దుకోవాల్సి ఉంది. అదేవిధంగా పార్టీని ముందుకు నడిపే క్రమంలో మిగిలిన నాయకులను కలుపుకుని పోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఈ క్రమంలో లోకేశ్ ఒకప్పటి తప్పులు చేయకూడదు. వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా కాకున్నా ఆయన నాయకత్వంపై కొందరికి నమ్మకాలు లేవు. ఆ నమ్మకాలు ఆయన కలిగిస్తే మేలు.