తంజావూరు బొమ్మల్లే ఉండే అందం బ్యూటిఫుల్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ సొంతం అని చెప్పొచ్చు. ఈ సుందరి టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ‘‘లయన్’’ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత ‘‘పండగ చేస్కో’’ సినిమాలో చాక్లెట్ బాయ్ రామ్ సరసన నటించింది. ఇందులో ‘‘స్వీటీ’’గా నెగెటివ్ రోల్ ప్లే చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇక ఇటీవల విడుదల అయిన F3 సినిమాలో కనిపించి కనువిందు చేసింది ఈ భామ. ఈ చిత్రంలో చక్కటి పాత్ర పోషించి తను కూడా నవ్వులు పూయించగలనని నిరూపించింది. సోషల్ మీడియాకు అతి తక్కువ సమయం వెచ్చించె ఈ అమ్మడు తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి.
సదరు ఫొటోల్లో సోనాల్ చౌహాన్ ఎరుపు రంగు డ్రెస్ ధరించి ఉన్నది. రెడ్ చిల్లిలా ఘాటుగా కనబడుతూ అలా అందాలన్నీ ఆరబోసేసింది ఈ భామ. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘‘ఎరుపు గులాబీ పువ్వులా, రెడ్ చిల్లీలా హాట్‌గా ఉన్నావ్’’ అని కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. సోనాల్ చౌహాన్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘‘ది ఘోస్ట్’’ హార్రర్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 27 న విడుదల కానుంది.
View this post on Instagram