ఏపీలో ఘోరం.. పేలిన గ్యాస్‌ సిలిండర్‌.. నలుగురు మృతి

-

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. జిల్లాలోని శెట్టూరు మండలం ములకలేడులో ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలిపోయింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. అయితే.. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అయితే పేలుడు శబ్దం విన్న స్థానికులు పోలీసులకు, ఆగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

6 injured in gas cylinder blast in Hyderabad

అయితే.. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు కూలిపోయింది. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు శిధిలాల నుంచి మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news