బాలకృష్ణని చూస్తే జాలిగా ఉంది: రోజా

-

బాలకృష్ణని చూస్తే జాలిగా ఉందని.. మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. ఇన్నాళ్లు గుర్తుకు రాని నిమ్మకూరు ఇప్పుడే గుర్తుకు వచ్చిందా..? అని ప్రశ్నించారు. కో ఆర్టిస్ట్ బాలకృష్ణని చూస్తే బాధేస్తోందని రోజు ఎద్దేవా చేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా ఉంటే ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత బాలకృష్ణని ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉండేవని.. ఎలాగైతే రాజశేఖరెడ్డి చనిపోయిన తర్వాత వైస్ జగన్ ముఖ్యమంత్రి అయినట్లు అంటూ విమర్శించారు. వీళ్ల అందరి అమాయకత్వాన్ని ఉపయోగించుకుని, వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు. 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని ఎన్టీఆర్ ఊరు.. ఇక్కడ టూరిజం డెవలప్ మెంట్ చేస్తానని చెప్పడం చూస్తే అమాయకుడని జాలి వేస్తోందని అన్నారు. గత ఐదేళ్లు వీళ్లే కదా అధికారంలో ఉన్నారని.. బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారని అప్పుడెందుకు నిమ్మకూరును పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడున్నది ఎన్టీఆర్ టీడీపీ కాదని.. నారా టీడీపీ అని కల్తీ టీడీపీ అని విమర్శించారు. చంద్రబాబు రాసిచ్చే స్క్రిప్టు చదవకుండా ఓ డైనమిక్ లీడర్ గా ఎదగాలని బాలకృష్ణకి సూచించారు రోజా.

Read more RELATED
Recommended to you

Latest news